Home  »  TV News  »  Brahmamudi : రాజు గతాన్ని వెతుకుతూ చలపతి ఇంటికి అపర్ణ..

Updated : May 14, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1031 లో..... అసలు ఈ రాజు గాడు ఎక్కడికి వెళ్ళాడని లక్కీ ఆలోచిస్తాడు. మరొకవైపు నాకు భయంగా ఉంది ఇంకా రాజు ఇంటికి రాలేదని చలపతి అంటాడు. వాడికి ఇదేం కొత్త కాదు కదా.. ఎందుకు భయమని లక్ష్మి అంటుంది. ఆ శృతి వచ్చి వెళ్లిన నుండి వాడి గురించి భయంగా ఉందని ఆ రేఖకి నిజం తెలిస్తే ఏమైనా చేస్తుందేమోనని చలపతి అంటాడు. ఆ తర్వాత సుభాష్ వాటర్ తీసుకోలేక ఇబ్బందిపడుతుంటే రాజు వచ్చి వాటర్ ఇస్తాడు. నేను కూడా మీ మనవడిని అనుకో తాతయ్య ఏం అవసరం ఉన్నా చెప్పండి అని రాజు అంటాడు. ఆ మాటలు అపర్ణ విని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అపర్ణ దగ్గరికి ఇందు వస్తుంది. నాకు ఆ అబ్బాయి ఇంటి అడ్రెస్ కావాలని అడుగుతుంది. నీ ఫోన్ కి లొకేషన్ షేర్ చేస్తానని ఇందు చెప్తుంది. మరొకవైపు వాళ్ళకి విడాకులు రావాలంటే వన్ ఇయర్ పడుతుందంట.. ఆ లోపు రాజు, ఇందు మరింత దగ్గర అవుతారు. వాళ్ళని ఎవరు విడదియ్యలేరని శేషుతో భ్రమరాంబ అంటుంది.

అప్పుడే రేఖ వస్తుంది. వదిన ఆ రాజు, ఇందు దగ్గరికి వెళ్లి వాళ్ళని ఒకే గదిలో పడుకొనివ్వకుండా చెయ్యాలని అంటుంది. ఎందుకు ఆల్రెడీ ఒకసారి తప్పు జరిగిపోయింది కదా అని శేషు అంటాడు. అలా అని వదిలేస్తామా ఇందుకి వాడంటే ఇష్టం లేదు.. విడిపోవాలని అనుకుంటుందని రేఖ చెప్తుంది. ముగ్గురు ఇందు దగ్గరికి వెళ్తారు. రాజు నువ్వు వెళ్లి బయట పడుకోమని రేఖ చెప్తుంది. నేను వెళ్ళను.. ఇప్పుడు మేం భార్యాభర్తలం ఇంకా ఫస్ట్ నైట్ అరెంజ్ చెయ్యాలని రాజు అనగానే ఇందు కోపంగా చూస్తుంది. దానికి టైమ్ పడుతుంది బాబు.. ఇందు నువ్వు వెళ్లి భ్రమరంబ గదిలో పడుకోమని పంపిస్తుంది. రాజుకి తోడుగా శేషుని పడుకోమని రేఖ చెప్తుంది.

ఆ తర్వాత అడ్రెస్ తీసుకొని చలపతి ఇంటికి వెళ్తుంది అపర్ణ. నా పేరు దుగ్గిరాల అపర్ణాదేవి అని పరిచయం చేసుకుంటుంది. ఆ మాట వినగానే శృతి చెప్పిన మాటలు గుర్తువస్తాయి. మీ అబ్బాయి అచ్చం మా అబ్బాయి లాగే ఉన్నాడు.. మాకు ఆక్సిడెంట్ అయినప్పుడు అందరు చనిపోయారు.. మా ఆయన నేను ఉన్నాం.. నా కూతురి కొడుకు మిస్ అయ్యాడని అపర్ణ ఎమోషనల్ అవుతుంది. తరువాయి భాగంలో ఇందు పెళ్లి చేసుకొని వచ్చిందని నందు తనపై కోపంగా ఉంటుంది. ఏంటి నువ్వు ఏదో నా సొంత చెల్లి అయినట్టు ఫీల్ అవుతున్నావని ఇందు అనగానే నీ సొంతచెల్లెలు కాబట్టి ఫీల్ అవుతున్నానని నందు చెప్పగానే ఇందు షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.